Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..

తెలంగాణ

Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో బీఆర్​ఎస్​ నేత జాన్సన్​​ నాయక్​ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్​కు పీఠం దక్కకుండా చేయాలని చేసిన ఆయన ప్రయత్నం ఫలించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 5, 2026 2:57 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
18 గంటలు ago
Share
Khanapur Municipal Election

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khanapur Municipal Election | నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో బీఆర్​ఎస్​ నేత జాన్సన్​​ నాయక్​ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్​కు పీఠం దక్కకుండా చేయాలని చేసిన ఆయన ప్రయత్నం ఫలించింది. జాన్సన్​ నాయక్​ చక్రం తిప్పడంతో ఖానాపూర్​ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్​ఎస్​ పార్టీ మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ పదవితో సరిపెట్టుకుంది.

Contents
  • Khanapur Municipal Election | వాయిదాల తర్వాత..
    • Khanapur Municipal Election | బీఆర్​ఎస్​ మద్దతుతో..
      • Khanapur Municipal Election | వీడిన ఉత్కంఠ

Khanapur Municipal Election | వాయిదాల తర్వాత..

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరిలో మున్సిపలు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే హంగ్​ వచ్చిన కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా.. ఈ చోట్ల ఫిబ్రవరి 17న ఎన్నికలు జరిగాయి. అయితే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం ఛైర్​పర్సన్​ల​ ఎన్నిక శనివారం పూర్తయింది. ఖానాపూర్​లో సైతం ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్​ సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆందోళన నిర్వహించగా అధికారులు పోస్ట్​పోన్​ చేశారు.

Khanapur Municipal Election | బీఆర్​ఎస్​ మద్దతుతో..

బల్దియాలో 12 వార్డులు ఉండగా.. బీఆర్​ఎస్​ 4, బీజేపీ 4, కాంగ్రెస్​ 3, ఒక చోట ఇండిపెండెంట్​ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ బలం ఐదుకు చేరింది. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్​ తీవ్రంగా ప్రయత్నం చేసింది. దీంతో ఖాన్​పూర్​ పీఠాన్ని అధికార పార్టీకి దక్కకుండా చేయాలని వ్యూహం రచించారు. బీజేపీకి మద్దతు ఇచ్చి ఛైర్​పర్సన్​ పీఠాన్ని ఆ పార్టీకి అప్పగించారు. వైస్​ ఛైర్మన్​ పదవిని బీఆర్​ఎస్​ నేతలు తీసుకున్నారు.

Khanapur Municipal Election | వీడిన ఉత్కంఠ

ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. పలుమార్లు వాయిదా పడిన ఎన్నిక ఎట్టకేలకు పూర్తి కావడంతో ఉత్కంఠ వీడింది. బీజేపీ కౌన్సిలర్​ అంకం మౌనిక ఛైర్​పర్సన్​గా ఎన్నిక కాగా.. బీఆర్​ఎస్​కు చెందిన మహమ్మద్ షోయబ్ వైస్​ ఛైర్మన్​గా గెలిచారు.

ఇది కూడా చదవండి..: Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం

BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం
Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు
TAGGED:bjp win khanapurbrs strategycongress defeat telanganakhanapur electionlocal body electionsmunicipal elections telangananirmal district newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sherylingampally Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన
Next Article Basara Temple Development Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?