Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు

నిజామాబాద్

online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు

ఆన్​లైన్​ గేమింగ్​కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. ఇలా చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 4:44 సా.
Shashi kiran Mottala
16 గంటలు ago
Share
online gaming addiction |
online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు

అక్షరటుడే, కామారెడ్డి: online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు అలవాటు పడిన యువత నేరాల బాట పడుతున్నారు. గేమ్​లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్​లైన్​ గేమ్​లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు (chain snatching) పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి (Yellareddy Police) డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

Contents
  • online gaming addiction | తాడ్వాయి మండలం ఎండ్రియాల్​లో..
    • online gaming addiction | బస్టాండ్​ వద్ద తిరుగుతుండగా..

online gaming addiction | తాడ్వాయి మండలం ఎండ్రియాల్​లో..

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2న తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో ఉదయం ఇంటిముందు పనులు చేసుకుంటున్న బాణాల అనసూయ అనే మహిళ మెడలో నుంచి ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు మూడు తులాల పుస్తెల తాడును చోరీ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల (CCTV investigation) ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు.

online gaming addiction | బస్టాండ్​ వద్ద తిరుగుతుండగా..

కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్​ వద్ద ఆదివారం తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు(gaming addiction) అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్​లైన్​ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..

 

Nizamabad Sports Development | క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
TAGGED:CCTV Investigationchain snatchinggaming addictiontelangana crimeYellareddy police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Basara Temple Development Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Next Article Madhapur Accident Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?