అక్షరటుడే, వెబ్డెస్క్: Basara Temple Development | నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర (Basara) సరస్వతి మాత ఆలయానికి సోమవారం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
బాసరలోని సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను శనివారం సీఎం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ పనులకు సోమవారం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
Basara Temple Development | ఈవీ వాహనాలకే..
రానున్న రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బాసరలో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు రూపొంచించాలని సూచించారు. బాసర ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Basara Temple Development | సీఎం పర్యటనకు ఏర్పాట్లు
బాసరలో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సీఎం పర్యటించే మార్గాలను తనిఖీ చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
ఇది కూడా చదవండి : Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
