అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madhapur Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్ (Madhapur)లో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొంది. అనంతరం స్కూటీని అలాగే 5 కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది.
కేరళ (Kerala)కు చెందిన హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్ భార్యభర్తలు. వీరు బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మహేశ్వరం దగ్గర నివాసం ఉంటూ.. మలబార్ జువెల్లరీ దుకాణంలో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తున్న వీరిని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొంది. మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం కింద స్కూటీ చిక్కుకుపోయింది. అయినా డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లాడు. దీంతో వాహనదారులు వెంబండించి పట్టుకున్నారు. అయితే అప్పటికే డ్రైవర్ పరారు కాగా.. క్లీనర్ దొరికాడు.
Madhapur Accident | ఆస్పత్రికి తరలించగా..
ఈ ఘటనలో దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయేషా చికిత్స పొందుతూ చనిపోయింది. బాసిత్ పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
షాకింగ్ వీడియో
మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
స్కూటీపై వెళ్తున్న అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకుని, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించిన యువకులు
డ్రైవర్… pic.twitter.com/djM7KFdcK4
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026
ఇది కూడా చదవండి : Hyderabad Drugs Party | మ్యూజిక్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురికి పాజిటివ్
