అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KBR Park Traffic | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆదివారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వన్‌వే అమలు చేశారు.
జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం చేపడుతోంది. పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మళ్లింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
KBR Park Traffic | ప్రయోగాత్మకంగా..
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించారు. ఒకటే మార్గంలో వాహనాలను అనుమతించారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను బంజరాహిల్స్ రోడ్డు నంబర్ 2 నుంచి వన్‌వేగా మళ్లించారు. టీవీ9 ఆఫీసు నుంచి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమ వైపునకు డైవర్ట్ చేశారు. ఈ రోజు చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతం అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో తలెత్తిన ఇబ్బందులను విశ్లేషించిన అనంతరం చర్యలు చేపట్టనున్నారు.
వన్ వే విధానాన్ని సీపీ సజ్జనార్ (CP Sajjanar) పరిశీలించారు. కేబీఆర్ పార్క్ (KBR Park Traffic ) మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన వన్ వే విధానాన్ని ఈ రోజు పరిశీలించాను.
కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాల రాకపోకలను… pic.twitter.com/lkqcVxoVRm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 5, 2026
దీనిని కూడా చదవండి : Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం
