అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Military Aircraft Crash | మధ్యప్రాచ్యంలో రోజురోజుకు యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతుండగా.. ఇరాన్ తీవ్రంగా ఎదురు దాడులు చేస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని కూల్చివేసిన వేసిన విషయం తెలిసిందే. విమానంలోని ఇద్దరు సిబ్బందిని అమెరికా రక్షించినట్లు నేడు ఉదయం ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఒక సి-130 సైనిక రవాణా విమానాలను కూల్చివేశామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది.
US Military Aircraft Crash | దక్షిణ ఇస్ఫహాన్‌లో..
దక్షిణ ఇస్ఫహాన్‌లో చొరబడిన శత్రువుల రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఒక సి-130 సైనిక రవాణా విమానాన్ని కూల్చివేశాం. అవి ఇప్పుడు తగలబడుతున్నాయి” అని ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ ఖతమ్ అల్-అన్బియా తెలిపారు. ఈ మేరకు ఎడారిలో చెల్లాచెదురుగా పడి ఉన్న అమెరికన్ విమాన శకలాల ఫొటోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా షేర్ చేసింది. ఈ ఫొటోలలో శకలాల నుంచి పొగ రావడం కనిపించింది. అయితే, అమెరికా సైన్యం విమాన నష్టాలను ధ్రువీకరించలేదు.
JUST IN: 🇺🇸🇮🇷 Footage shows wreckage of US Black Hawk helicopters and C-130 military transport aircraft destroyed by US forces before departing Iran. pic.twitter.com/uJv89NVfbj
— BRICS News (@BRICSinfo) April 5, 2026
ఇది కూడా చదవండి..: American Pilot Rescue | ఇరాన్లో అమెరికన్ పైలెట్ సేఫ్.. అతడిని రక్షించినట్లు ట్రంప్ ప్రకటన
