అక్షరటుడే, వెబ్డెస్క్: Handcuffs | సాధారంగా బేడీలను తీవ్రమైన నేరాల్లో నిందితులకు వేసి అరెస్ట్ చేస్తారు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో మాత్రం గేటుకు తాళంలా ఉపయోగిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ కేసు విచారణలో భాగంగా స్టేషన్ లోపలికి ఎవరూ రాకుండా ఇలా బేడీలతో తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది.
Handcuffs | రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో..
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలతో తాళం వేయడం విస్మయం కలిగిస్తోంది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర విచారణలో భాగంగా రైల్వేకోడూరు పీఎస్‌లో ఈ వింత ఘటన జరిగింది. ఇటీవల నడిరోడ్డుపై.. ఓ మహిళపై జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాగేంద్రను విచారిస్తున్న పోలీసులు.. లోపలికి ఎవరూ రాకుండా ఉండేందుకు అధికారులు గేటుకు బేడీలు వేశారు. మహిళపై దాడి చేసిన నాగేంద్రకు బేడీలు వేయకుండా.. స్టేషన్ గేటుకు వేయడం ఏమిటని స్థానికులు అవాక్కయ్యారు. కాగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి చేసిన నాంద్రపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Visakha Earth Tremors | ఉమ్మడి విశాఖలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
