Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడి అరెస్ట్

తెలంగాణ

MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడి అరెస్ట్

ఎంఐఎం కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ కుమారుడు మహ్మద్‌ సాహిల్​ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 6:32 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
MIM Leader Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ కుమారుడు మహ్మద్‌ సాహిల్​ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, అధికారుల విధులను అడ్డుకున్నందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Contents
  • MIM Leader Arrest | సోషల్​ మీడియాలో వైరల్
    • MIM Leader Arrest | ఉద్రిక్తత

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఫుట్​పాత్​లపై ఆక్రమణలు తొలగించేందుకు ప్రతి శనివారం జీహెచ్​ఎంసీ (GHMC) అధికారులు ప్రత్యేక డ్రైవ్​ చేపడుతున్న విషయం తెలిసిందే. శనివారం సైతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో చార్మీనార్​ సమీపంలో ఫుట్​పాతలపై ఏర్పాటు చేసిన డబ్బాలు, షెడ్లను తొలగించేందుక పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్​ఎంసీ అధికారులు వెళ్లారు. వారిని ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడు సాహిల్​, నాయకులు అడ్డుకున్నారు.

MIM Leader Arrest | సోషల్​ మీడియాలో వైరల్

ఎంఐఎం నాయకులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల ఎదుటే జీహెచ్​ఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. జేసీబీలకు అడ్డం పడుకొని నిరసన తెలిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. సామాన్యులు చిన్న తప్పులు చేస్తే కేసులు నమోదు చేసే పోలీసులు ఎంఐఎం నాయకులను ఏమి అనకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాయకులు రెచ్చిపోతున్నా.. పోలీసులు సైలెంట్​గా ఉండటంపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు (Hyderabad Police) చర్యలు చేపట్టారు.

MIM Leader Arrest | ఉద్రిక్తత

పోలీసులను తోసివేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని మహ్మద్ సాహిల్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అధికారులను బెదిరించడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆయనను విచారణ నిమిత్తం ఠాణాకు తరలించారు. అరెస్ట్ సమయంలో చార్మినార్ (Charminar) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

 దీనిని కూడా చదవండి : Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

 

Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Gosala Project | రూ.157 కోట్లతో గోశాల నిర్మించనున్న ప్రభుత్వం
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:Charminar clashencroachment issueghmc driveHyderabad newsMIMMohammed Sahilpolice arrest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article ayushman vay vandana card Ayushman Vay Vandana Card | సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత.. రూ.5 లక్షల ఉచిత చికిత్స కవరేజీ!
Next Article Perini dance exams | Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?