అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Friend stabbing incident | డబ్బుల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
డబ్బుల కోసం ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఒక వ్యక్తిపై అతడి స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. హన్మకొండ జిల్లా గోపాలపురంలో ఈ ఘటన జరిగింది. గోపాలపురం ప్రాంతానికి చెందిన రామ్ చరణ్, కార్తీక్ స్నేహితులు. వీరిద్దరి మధ్య రూ.3 లక్షలకు సంబంధించి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో రామ్ చరణ్‌పై దాడి చేశాడు.
Friend stabbing incident | తీవ్ర గాయాలు
దాడిలో రామ్ చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కత్తిపోట్ల అనంతరం నిందితుడు కార్తీక్ పరారు అయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి
