అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump warns Iran | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారంలోపు హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికా (America)పై సైతం ఈ ప్రభావం పడింది. దీంతో హర్ముజ్ జలసంధిని తెరవాలని ఇటీవల ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో ఆదివారం మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యకర పదాలు వాడటం గమనార్హం.
Trump warns Iran | పవర్ ప్లాంట్లపై..
అమెరికా ఇటీవల ఇరాన్‌లోని ఖార్గ్ ద్వీపంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దీని టెహ్రాన్ సైతం దీటుగా ప్రతిస్పందించింది. అయితే హర్ముజ్ జలసంధిని ఎల్లుండిలోపు తెరవాలని ట్రంప్ ఆదేశించారు. లేకపోతే మంగళవారం ఇరాన్‌పై దాడులు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామన్నారు. జలసంధిని మూసి ఉంచడం కొనసాగిస్తే ‘ఇరాన్‌పై నరకం విసురుతామని’, ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.
పోస్ట్‌లో ట్రంప్ (Trump warns Iran) వాడిన పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అసహనానికి, ఓటమికి అవి నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ దెబ్బకు అమెరికా భారీగా నష్టపోయింది. దీంతో ట్రంప్ ఆవేశంతో పోస్ట్‌లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కాగా గతంలో సైతం ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం అవుతుందో చూడాలి.
US President Donald Trump has posted this about the Iran War on his official Truth Social account. pic.twitter.com/8ymSOFcWRm
— ANI (@ANI) April 5, 2026
దీనిని కూడా చదవండి : US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!
