Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ

Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు

జాగృతిలో పలువురు నాయకులు చేరారు. కల్వకుంట్ల కవిత కండువా కప్పి వారిని సంస్థలోకి ఆహ్వానించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 8:54 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Kavitha new party

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kavitha new party | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాగృతిలో భారీగా కార్యకర్తలు చేరుతున్నారు.

తెలంగాణ జాగృతి నాయకురాలు అరుణ ఆధ్వర్యంలో కూకట్​పల్లి (Kukatpalli)కి చెందిన పలువురు మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు. గాజులరామారం డివిజన్​కు చెందిన పలువురు యువకులు జాగృతి నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి కవిత పార్టీలోకి ఆహ్వానించారు. జాగృతి క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు డేవిడ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్​పేట డివిజన్​, ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్​కు చెందిన యువకులు జాగృతిలో చేరారు.

Kavitha new party | రాజకీయ శక్తిగా వస్తున్నాం

మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని కవిత తెలిపారు. సింగరేణి (Singareni) సమస్యలపై ఆమె ఆదివారం రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు. తాము తీర్మానం చేసిన అంశాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత బొగ్గు బాయిబాట పడుతామని హెచ్చరించారు. అదే విధంగా సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందన్నారు.

కవిత కొత్త పార్టీ (Kavitha new party) ఈ నెల 25న పెట్టనున్న విషయం తెలిసిందే. పార్టీలో టీఆర్​ఎస్​ పేరు ఉండేలా ఆమె చూస్తున్నట్లు సమాచారం. ఆ రోజు పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే జనంబాటతో కవిత  రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. పలు ప్రజా సమస్యలపై ఆందోళనలు చేశారు. పార్టీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆమె చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన

 

SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ.. బేకరీపై పోలీసుల దాడులు
TAGGED:KavithaKCR familynew political partyparty launchPolitical NewsTelangana JagrutiTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Basara temple development Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
Next Article Revanth Reddy youth sports Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?