అక్షరటుడే, హైదరాబాద్: Revanth Reddy youth sports | తెలంగాణలో యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యలపై ముఖ్యమంత్రి Revanth Reddy కీలక వ్యాఖ్యలు చేశారు.
పబ్ కల్చర్ కంటే ప్లే గ్రౌండ్ కల్చర్ యువతకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. చదువు మాత్రమే విజయానికి మార్గం కాదన్నారు. టాలెంట్ ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పుకొచ్చారు.
Revanth Reddy youth sports | పంజాబ్ లాంటి పరిస్ఙితులు రానివ్వబోం..
యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై సీం ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న వారే డ్రగ్స్ బారిన పడటం బాధాకరమన్నారు. Telanganaలో పంజాబ్ లాంటి పరిస్థితులు రానివ్వబోమని స్పష్టం చేశారు.
కట్టుబడి ఉన్నాం..
క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఖాయం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ Mohammed Sirajకు నిబంధనలు సడలించి ఉద్యోగం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
