అక్షరటుడే, వెబ్డెస్క్ : Heatwave Telangana | రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరగనున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. అయితే సోమవారం నుంచి వాతావరణం (Weather) పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణ పరిధిలోనే ఉంటాయి. ఏప్రిల్ 10 తర్వాత, వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో ఉత్తర, తూర్పు తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు, హైదరాబాద్ నగరంలో 39-41 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Heatwave Telangana | వర్షాలతో తీవ్ర నష్టం
మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో (Unseasonal Rains) పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం వరి, మొక్క జొన్న పంటలు కోత దశకు వచ్చాయి. ఈ క్రమంలో వర్షాలు పడుతుండటంతో రైతులు (Farmers) ఆందోళన చెందారు. అయితే రానున్న రోజుల్లో వర్షాలు లేవని అధికారులు చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్
