Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం

జాతీయం

Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం

మరణం అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన శరణ్య కథ, మనసులో ధైర్యం ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా జయించవచ్చని మరోసారి నిరూపించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 10:34 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Kerala Techie Missing Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Techie Missing Case | కర్ణాటక (Karnataka) దట్టమైన అడవుల్లో చోటుచేసుకున్న ఓ ఉత్కంఠభరిత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Contents
  • Kerala Techie Missing Case | ట్రెక్కింగ్‌లో తప్పిపోయిన శరణ్య
    • Kerala Techie Missing Case | ఏనుగుల సంచారం, భారీ వర్షం

జి.ఎస్. శరణ్య అనే 36 ఏళ్ల మహిళ, ప్రాణాపాయ పరిస్థితుల్లో నాలుగు రాత్రులు ఒంటరిగా గడిపి, చివరకు సురక్షితంగా బయటపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొడగు జిల్లా (Kodagu District) కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతం… చుట్టూ ఏనుగుల సంచారం… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం (Heavy Rain)… చేతిలో కేవలం అర లీటర్ నీరు మాత్రమే… ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆశలు వదిలేసే పరిస్థితి. కానీ శరణ్య మాత్రం అసాధారణ ధైర్యంతో నిలబడి, మృత్యువునే జయించింది.

Kerala Techie Missing Case | ట్రెక్కింగ్‌లో తప్పిపోయిన శరణ్య

టేడియాండమోల్ శిఖరాన్ని (Tediandamol Peak) అధిరోహించేందుకు ఏప్రిల్ 2న శరణ్య 10 మంది సభ్యులతో కలిసి ట్రెక్కింగ్‌కు బయలుదేరారు. ఉదయం బేస్ క్యాంప్ చేరుకున్న ఆమె, తిరుగు ప్రయాణంలో దారి తప్పిపోయారు.మొబైల్ సిగ్నల్ లేకపోవడం, కొద్దిసేపటికే ఫోన్ బ్యాటరీ అయిపోవడం వల్ల ఎవరితోనూ సంప్రదించలేకపోయారు. చేతిలో ఉన్న చిన్న నీళ్ల బాటిల్ తప్ప మరే సరఫరా లేకుండా అడవిలోనే చిక్కుకుపోయారు. శరణ్య తన అనుభవాన్ని వివరిస్తూ.. మొదటి రోజు సాయంత్రం వరకు నడిచాను. దారి కనిపించకపోవడంతో ఒక వాగు పక్కన ఆగిపోయాను. ప్రతిరోజూ ఎవరో కనిపిస్తారనే ఆశతో నడుస్తూనే ఉన్నాను. ఆశ్చర్యంగా నాకు భయం అనిపించలేదు” అని తెలిపారు.

Kerala Techie Missing Case | ఏనుగుల సంచారం, భారీ వర్షం

ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతం, భారీ వర్షం, ఆహారం లేకపోవడం ప్రమాదకర పరిస్థితులే అయినప్పటికీ, ఆమె మానసిక ధైర్యం కోల్పోలేదు. ఇదే ఆమె ప్రాణాలను కాపాడిన ప్రధాన కారణంగా భావిస్తున్నారు. శరణ్య కనిపించకపోవడంతో, సిద్ధరామయ్య ఆదేశాల మేరకు భారీ గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, అటవీ శాఖ అధికారులు, యాంటీ నక్సల్ స్క్వాడ్ (Anti-Naxal Squad), స్థానిక గిరిజనులు కలిసి అడవిని జల్లెడ పట్టారు. థర్మల్ డ్రోన్ కెమెరాల (Thermal Drone Cameras) సహాయంతో కూడా విస్తృతంగా గాలింపు కొనసాగించారు. చివరికి ఎవరూ వెళ్లని ఓ మారుమూల ప్రాంతంలో స్థానికులు శరణ్యను గుర్తించి రక్షించారు. నాలుగు రోజుల పాటు ఆహారం, సరైన నీరు లేకుండా ఉన్నప్పటికీ, ఆమె చిరునవ్వుతో బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈశ్వర్ ఖండ్రే శరణ్యను “సాహసవంతురాలు”గా కొనియాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరలోనే స్వగృహానికి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..

Amit Shah Statement | భారత్​ ధర్మసత్రం కాదు.. అక్రమ చొరబాట్లపై అమిత్​ షా సంచలన వ్యాఖ్యలు
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
TAGGED:Anti-Naxal SquadHeavy RainKarnatakaKerala Techie Missing CaseKodagu DistrictTediandamol PeakThermal Drone Cameras
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Heatwave Telangana Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు
Next Article Zomato RCB CSK Controversy Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?