అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Zomato RCB CSK Controversy | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ అనంతరం ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో
(Zomato) చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. జొమాటో అత్యుత్సాహంతో దానిని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఐపీఎల్లో ఆదివారం బెంగళూరు, చెన్నై మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో మ్యాచ్ అనంతరం జొమాటో బెంగళూరు సాంబార్ > చెన్నై సాంబార్ అని పోస్ట్ చేసింది. చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబర్ ఎక్కవ అని అర్థం వచ్చేలా పోస్టు ఉంది. దీంతో జొమాటోపై తమిళనాడు, కర్ణాటక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్కృతిని కించపరిచేలా ఐపీఎల్ మ్యాచ్ (IPL Match) సందర్భంగా పోస్ట్ పెట్టడంపై మండిపడుతున్నారు.
Zomato RCB CSK Controversy | బ్యాన్ జొమాటో
సోషల్ మీడియా (Social Media)లో జొమాటోతపై తీవ్ర స్థాయిలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బ్యాన్ జొమాటో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేగాకుండా పలువురు తమ ఫోన్ల నుంచి ఈ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. “CSK vs RCB మ్యాచ్ జరిగినప్పుడు, CSKనే RCB కంటే గొప్పదని చెబుతూ మీరు ఎప్పుడైనా ఇలా ట్వీట్ చేశారా? ఇప్పుడు అభిమానుల మనోభావాలతో ఆడుకుంటూ, ఆహారాన్ని ఎందుకు పోలుస్తున్నారు?” అని ఒక CSK అభిమాని ప్రశ్నించారు. మరోవైపు దీనిపై సీఎస్కే, ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం పెద్ద ఎత్తున చర్చకు తెర లేపారు. జొమాటోను ఆర్సీబీ ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తుండగా.. చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..
