Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం -  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

అంతర్జాతీయం

 Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

అమెరికాకు ఇరాన్​ వార్నింగ్ ఇచ్చింది. తమ మౌలిక వసతులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 11:02 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
 Iran US Conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran US Conflict | హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్​లోని పవర్​ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని, ఆ దేశాన్ని నరకం చేస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్​ హెచ్చరికలకు ఇరాన్​ సైతం దీటుగా స్పందించింది.

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తగిన విధంగానే ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అమెరికా దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమన్నారు. అమెరికా యాజమాన్యంలో ఉన్న, అమెరికాకు సంబంధించిన, ఇరాన్‌పై వారి దురాక్రమణ చర్యకు దోహదపడే ఎలాంటి మౌలిక సదుపాయాలనైనా తమ సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు.

Iran US Conflict | నరకంలోకి అమెరికా…

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ.. వాషింగ్టన్ ఒక “నరకంలోకి” లాగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రంప్​ దుందుడుకు చర్యలు అమెరికాలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని నరకంలోకి నెడుతున్నాయని విమర్శించారు. ‘యుద్ధ నేరాల ద్వారా మీరు ఏమీ సాధించలేరని” ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించడం, ఈ ప్రమాదకరమైన ఆటను ముగించడమే నిజమైన పరిష్కారమన్నారు.
కాగా మంగళవారంలోగా హర్ముజ్​ జలసంధిని తెరవాలని ట్రంప్​ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్​లో అసభ్యకర పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. జలసంధిని తెరవకపోతే మంగళవారం ఇరాన్​పై వైమానిక దాడులు చేస్తామన్నారు. అయితే ట్రంప్​ హెచ్చరికలన ఇరాన్​ లెక్క చేయడం లేదు. దీంతో రేపు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ!

Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా
Iran Downs US Jets | అమెరికా యుద్ధ విమానాలు కూల్చి వేసిన ఇరాన్​
Stock Market Gains | ఐటీలో దూకుడు.. నాలుగో రోజూ లాభాలే!
TAGGED:Donald Trumpglobal security newsIran US conflictMiddle East conflictMilitary EscalationSocial MediaStrait of HormuzStrait of Hormuz crisisTrump Iran WarningUS Iran Relationsworld politics news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Zomato RCB CSK Controversy Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో
Next Article Cyanide Murder Case Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?