Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి

జాతీయం

Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి

కల్తీ మద్యం తాగి ముగ్గురు చనిపోయారని భావించారు. అసలు చూస్తే పక్కా పథకంతో చేసిన హత్యగా బయటపడింది. అన్నను చంపేందుకు సైనేడ్ కలిపిన మద్యం ఇవ్వగా, అది ముగ్గురి ప్రాణాలు తీసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 11:12 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Cyanide Murder Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyanide Murder Case | మీరట్ జిల్లా (Meerut District)లోని దౌరాలాలో చోటుచేసుకున్న ముగ్గురు వ్యక్తుల మృతి కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత కల్తీ మద్యం కారణంగా జరిగిన ప్రమాదంగా భావించిన ఈ ఘటన, వాస్తవానికి పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా పోలీసులు తేల్చారు.

Contents
  • Cyanide Murder Case | మద్యం ప్యాకెట్‌లో సైనేడ్ కలిపి..
    • Cyanide Murder Case | పోలీసులు ఈ కుట్రను ఛేదించారు

మృతుడు అంకిత్ అలియాస్ దౌలత్‌ను హతమార్చేందుకు అతని సోదరి అల్కా, ఆమె ప్రియుడు పవన్ కలిసి కుట్ర పన్నారు. వీరికి సైనేడ్‌ను సరఫరా చేసిన స్వర్ణకారుడు అశోక్ అలియాస్ సోనీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం రూ.500కే అశోక్ ఈ ప్రాణాంతక విషాన్ని ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

Cyanide Murder Case | మద్యం ప్యాకెట్‌లో సైనేడ్ కలిపి..

మొదట అంకిత్ ఆహారంలో సైనేడ్  కలపాలని ప్లాన్ చేసినా, భయంతో అల్కా ఆ ప్రయత్నాన్ని వదిలేసింది. తర్వాత పవన్ కొత్త ప్లాన్ అమలు చేశాడు.ఒక యువకుడి ద్వారా దేశీ మద్యం టెట్రా ప్యాక్ కొనిపించి, దాన్ని ఓపెన్ చేసి అందులో సైనేడ్ కలిపాడు. తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి ప్యాక్ చేసి అంకిత్‌కు అందించాడు.మద్యం అలవాటు ఉన్న అంకిత్, ఆ ప్యాకెట్‌ను తీసుకుని తన స్నేహితులు బాబురామ్, జితేంద్రతో కలిసి తాగాడు. కొద్దిసేపటికే ముగ్గురూ అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. మొదట ఇది కల్తీ మద్యం (Adulterated liquor) ఘటనగా అనుమానించిన పోలీసులు, పోస్టుమార్టం నివేదికలో సైనేడ్ ఉన్నట్లు గుర్తించారు. అదే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసిన ఇతరులకు ఎలాంటి సమస్యలు రాకపోవడంతో అనుమానం మరింత బలపడింది.

Cyanide Murder Case | పోలీసులు ఈ కుట్రను ఛేదించారు

దీంతో ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, చివరకు ఈ కుట్రను ఛేదించారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, అంకిత్ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తన సోదరిని వేధించేవాడు. అల్కా – పవన్  ప్రేమను కూడా అతను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఇటీవల అతని ప్రవర్తన మరింత దారుణంగా మారడంతో, ఇద్దరూ కలిసి అతడిని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పవన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలక ఆధారాలను గుర్తించారు. గూగుల్‌లో “సైనేడ్ ఎక్కడ దొరుకుతుంది?”, “విషం ఎలా ఇవ్వాలి?” వంటి సెర్చ్‌లు చేసిన రికార్డులు బయటపడ్డాయి. ఈ డిజిటల్ ఆధారాలు కేసు ఛేదనలో కీలకంగా మారాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారు. వారిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం

President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
IRCTC boarding change | రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అరగంట ముందూ స్టేషన్ మార్చుకోవచ్చు
TAGGED:Adulterated liquorCrime Investigationcyanide murderCyanide Murder Caseillegal liquor caseIndia crime newsmeerut crimeMeerut Districtmurder conspiracypoisoning casetoxic alcohol
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article  Iran US Conflict  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Next Article Road Accident Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?