Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

అంతర్జాతీయం

Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

రాత్రి పూట కాంతిని వెదజల్లే మొక్కలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 11:24 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Glowing Plants China

అక్షరటుడే, వెబ్​డెస్క్: Glowing Plants China | మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతాయి. ఆక్సిజన్​ను అందిస్తాయి. అయితే ఈ మొక్కలు మాత్రం కాంతిని వెదజల్లుతాయి. రాత్రిళ్లు మెరిసే మొక్కలను చైనా శాస్త్రవేత్తలు (China Scientists) అభివృద్ధి చేశారు.

చైనా శాస్త్రవేత్తలు చీకట్లో మెరవగల జన్యుపరంగా మార్పు చేసిన మొక్కలను ఆవిష్కరించారు. ఈ అద్భుత ఆవిష్కరణ పట్టణ దీపాలంకరణ, పర్యాటక రంగాలను మార్చివేయగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు. జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి ఈ మొక్కలను అభివృద్ధి చేశారు. మిణుగురు పురుగులు, కాంతినిచ్చే శిలీంధ్రాల నుంచి కాంతిని ఉత్పత్తి చేసే జన్యువులను మొక్కల కణాలలోకి బదిలీ చేసిన తర్వాత సహజమైన కాంతిని వెదజల్లే మొక్కలను తయారు చేశారు.

Glowing Plants China | మిణుగురు పురుగులతో..

మ్యాజిక్‌పెన్ బయో (MagicPen Bio) అనే బయోటెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు లీ రెన్‌హాన్ మాట్లాడుతూ.. మిణుగురు పరుగుల వలే మెరిసే మొక్కలను తయారు చేయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. మిణుగురు పురుగుల జన్యువులను మొక్కలలోకి బదిలీ చేయాలనుకున్నామని చెప్పారు. దీంతో అవి కూడా రాత్రిపూట మెరవగలవు. ఈ సాంకేతికతను సాంస్కృతిక పర్యాటకానికి, రాత్రిపూట ఆర్థిక వ్యవస్థకు తీసుకురావడానికి మేము అంకితభావంతో ఉన్నామని వెల్లడించారు. ఈ మొక్కలను ఇటీవల జోంగువాన్‌కున్ ఫోరమ్‌ (Zhongguancun Forum)లో ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి..:  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

 

Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
TAGGED:biotech research ChinaChina innovationChina Scientistsfuture technologygenetic engineering plantsGlowing Plants Chinaluminous plantsMagicPen Bioscience news updatesurban lighting solutionsZhongguancun Forum
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Accident Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
Next Article Stock Market Losses Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?