అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoist Surrender | మావోయిస్ట్‌ల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట 40 మంది నక్సల్స్ సరెండర్ అయినట్లు సమాచారం. ఇందులో PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా సైతం ఉన్నారు.
తెలంగాణ పోలీసుల ఎదుట సుమారు 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో రాష్ట్రంలో మావోయిస్టు కేడర్ బలం దాదాపు సున్నాకు పడిపోయింది. పీఎల్జీఏ కమాండర్ బర్స దేవా గతంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు కేశాలు రెండో కమాండర్‌గా పరిగణించబడ్డాడు. మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్ కగార్ చేపట్టింది.
Maoist Surrender | ఛత్తీస్‌గఢ్‌లో పలువురు
ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతం అయ్యారు. ఇందులో కీలక నేతలు సైతం ఉన్నారు. దీంతో ఉద్యమం బలహీన పడటంతో చాలా మంది లొంగుబాట పట్టారు. మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ సైతం సరెండర్ అయ్యారు. దీంతో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగింపు దశకు వచ్చింది. అయితే ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ నక్సల్స్ ఉన్నట్లు సమాచారం. వీరి కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 40 మంది లొంగిపోయారు.
Maoist Surrender | బెటాలియన్ బాధ్యతలు
మావోయిస్టుల లొంగుబాటును పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లో వారిని మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. వారి నుంచి ఏకే-47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోడి కేశాలు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంబడి పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ) బెటాలియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించాడు. కర్రెగుట్టల్లో మావోయిస్టు కేడర్‌లకు నాయకత్వం వహించాడు బర్స దేవా లొంగిపోయిన తర్వాత బెటాలియన్ బాధ్యతలు స్వీకరించాడు.
ఇది కూడా చదవండి..: Shamshabad Airport Flight Issue| రన్‌వేపై ఆగిపోయిన విమానం..
