Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​

ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కొత్తగా ఫుడ్​ సేఫ్టీ ల్యాబ్​లు ఏర్పాటు చేస్తామన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 12:09 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Food Adulteration Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్: Food Adulteration Warning | ఆహార పదార్థాలను కల్తీ చేసే వారికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) వార్నింగ్​ ఇచ్చారు. కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Contents
  • Food Adulteration Warning | ఫుడ్​ టెస్టింగ్​ ల్యాబ్​లు
    • Food Adulteration Warning | అన్నింటా కల్తీ

ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్​ సోమవారం హైదరాబాద్ (Hyderabad)​లో నిర్వహించారు. మంత్రి రాజనర్సింహ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకూ ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ (Food Safety Awareness Walkathon) ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫుడ్ సేఫ్టీ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతర తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రెండేళ్లలో 11,000కు పైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Food Adulteration Warning | ఫుడ్​ టెస్టింగ్​ ల్యాబ్​లు

నాసిరకం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామన్నారు. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్లతో 3 రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ (Regional Food Testing Laboratory)లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Food Adulteration Warning

Food Adulteration Warning | అన్నింటా కల్తీ

ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, చాయిపత్తీ దేన్నీ వదలకుండా కల్తీ చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని చెప్పారు. వీటిని తిన్న ప్రజలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు. నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారం పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణమని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఆహారం కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం
Stock Market Crash | బ్లాక్ మండే!.. భారీగా పతనమైన సూచీలు రూ. 8.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ
Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
March 07 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:Damodar RajanarasimhaFood Adulteration Warningfood inspectionsfood qualityFood Safety Awareness WalkathonFood safety Indiahealth minister warningHyderabadHyderabad newsindia newspublic healthRegional Food Testing Laboratory
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maoist Surrender  Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు
Next Article Small LPG Cylinder Demand Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్‌కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?