అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyundai Car Offers | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ (Hyundai Motor) ఇండియా పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, ఎలక్ట్రానిక్ వాహనాల (Electronic vehicles) పై భారీగా డిస్కౌంట్‌ను అందిస్తోంది.
కారు మోడల్, వేరియంట్, ఎక్స్ఛేంజ్ ఎలిజిబిలిటీని బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్, కార్పొరేట్ బెనిఫిట్స్, రూరల్ ఇన్సెంటివ్‌లు లభించనున్నాయి.
Hyundai Car Offers | ఏ కారుపై ఏ ఆఫర్ వర్తిస్తుందో తెలుసుకుందామా..
సిటీ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ ఐ10 నియోస్ హైయర్ ట్రిమ్స్‌పై రూ. 68 వేలు వరకు ప్రయోజనాలు లభించనున్నాయి
హ్యుందాయ్ ఆరాపై రూ. 20 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20పై రూ. 58 వేలు వరకు ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఎక్స్‌టర్ పాత స్టాక్‌పై రూ. 43 వేలు, కొత్త ట్రిమ్స్‌పై రూ. 5 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.
వెన్యూపై రూ. 5 వేల వరకు ప్రయోజనాలను అందించనుంది.
పాత స్టాక్ హ్యుందాయ్ వెర్నా ఐవీటీ ట్రిమ్స్ (IVT Trims) పై రూ. 1.10 లక్షలు, క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు, ఎన్‌లైన్ వేరియంట్స్‌పై రూ. 55 వేలు, అల్కజార్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 70 వేలు, డీజిల్ వేరియంట్‌పై రూ.30 వేల వరకు ప్రయోజనాలను ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు
