అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Alcohol Price Hike | మద్యంప్రియులకు ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచడానికి సిద్ధం అయింది.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇప్పటికే గ్యాస్, చమురు ధరలు (Oil Prices) భారీగా పెరిగాయి. తాజాగా ఆ ప్రభావం మద్యం ధరలపై సైతం పడనుంది. మద్యం, బీర్ల ధరలు మే నెలలో పెరగనున్నట్లు సమాచారం. యుద్ధం ఎఫెక్ట్‌కు తోడు.. రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. 2023 మే నెలలో ధరలను పెంచగా.. మళ్లీ 2025 మేలో పెంచాల్సి ఉంది. అయితే ఈ గడువు ముగిసి ఏడాది కావొస్తుంది. దీంతో ధరలు పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
Alcohol Price Hike | పెరిగిన ధరలు
యుద్ధ ప్రభావంతో సహజ వాయువు సరఫరా దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయం నెలకొంది. దీంతో గాజు తయారీ కేంద్రాల్లో 40 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో మద్యం ధరలను పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను (Excise Department Officers) కలిసి 12- 15శాతం వరకు ధరలు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం ధరల పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కమిటీని కూడా వేసినట్లు తెలిసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక అనంతరం మే నెలలో మద్యం, బీర్ల ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్
