అక్షరటుడే, వెబ్డెస్క్: Basara Temple Development | నిర్మల్ జిల్లా (Nirmal District) బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Basara Temple Development | రూ.225 కోట్లతో ఈ అభివృద్ధి పనులు..
రూ.225 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని 60 వేల చదరపు అడుగుల వరకు విస్తరించనున్నారు. అలాగే కొత్త ఆలయ శిఖరాలు, మాడవీధులు, మండపాలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చేయేడు జరిగే గోదావరి పుష్కరాల సమయానికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు.
Basara Temple Development | సీఎం మనవడికి అక్షరాభ్యాసం
అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి బాసర సరస్వతి (Basara Saraswati) అమ్మవారి క్షేత్రంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు పలక బలపంతో అక్షరాభ్యాసం చేయించారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, బుజ్జి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
