Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..

నిజామాబాద్

BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాంమని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 4:50 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
BJP Strengthening Drive

అక్షరటుడే, బాన్సువాడ: BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని పార్టీ బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి అన్నారు. పట్టణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని (BJP Foundation Day) పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Contents
  • BJP Strengthening Drive | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ..
    • BJP Strengthening Drive | నరేంద్ర మోదీ నాయకత్వంలో..

BJP Strengthening Drive | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న బీజేపీ స్థాపించబడిందని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్​పేయి (Atal Bihari Vajpayee), ఎల్.కే. అద్వానీ (L.K. Advani) వంటి మహా నాయకుల కృషితో పార్టీ ఆరంభమైందన్నారు. మొదటి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజపేయి బాధ్యతలు చేపట్టి పార్టీని బలోపేతం చేశారని వివరించారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రారంభమైన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది సభ్యత్వంతో పాటు ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని చెప్పారు.

BJP Strengthening Drive | నరేంద్ర మోదీ నాయకత్వంలో..

2014లో నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాభిమానాన్ని పొందిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సిద్ది బాలరాజ్, నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారం, శంకర్, మహేందర్, రఘువీర్, నాగరాజు, సాయి రెడ్డి, పురుషోత్తం, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి

Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
Police Retirement Advice | కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి: అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర
Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
TAGGED:Atal Bihari VajpayeeBJP Foundation DayBJP Strengthening DriveCentral GovernmentL.K. AdvaniNarendra Modi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lungs Transport Operation Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు
Next Article Kohheda Fruit Market Kohheda Fruit Market | రూ.3 వేల కోట్ల భూములపై సీఎం కన్ను: హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?