అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kohheda Fruit Market | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మడానికి ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన సోమవారం పండ్ల మార్కెట్‌ను సందర్శించారు.
రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్ను పడిందని హరీశ్‌రావు అన్నారు. రూ.3 వేల కోట్లు విలువ చేసే ఈ భూములను తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ నిర్మాణానికి స్థలంతో పాటు రూ. 350 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలని దళారుల కోసం కాదన్నారు.
Kohheda Fruit Market | 200 ఎకరాల్లో ..
భవిష్యత్‌లో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ తగ్గించడానికి బీఆర్ఎస్ హయాంలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. ఇక్కడ 200 ఎకరాల్లో మార్కెట్‌ను నిర్మించాలని కేసీఆర్ భావించారని ఈ మేరకు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉంచామని చెప్పారు. డీపీఆర్ కూడా సిద్ధం అయిందన్నారు. అన్ని ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మార్కెట్ నిర్మాణం చేపట్టకుండా.. ఆ భూములను అమ్మాలని చూస్తోందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి ఎకరాల భూమిని నిషేధిత భూముల్లో చేర్చారని హరీశ్‌రావు ఆరోపింఆరు. రైతుల భూములను నిషేధితా జాబితాలో పెట్టి ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి కోహెడలో మార్కెట్‌ను నిర్మించాలని కోరారు. మార్కెట్ నిర్మించకపోతే రైతుల పక్షాన కొట్లాడుతామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు
