Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు

అమెరికా, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్‌పై ఆశలు చిగురించడంతో స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో ముగిశాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 4:50 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Stock Market Gains | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని, నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ను బెదిరించడంతో స్టాక్ మార్కెట్లు మొదట్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అయితే అమెరికా, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్‌పై ఆశలు చిగురించడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, కన్జూమర్ డ్యూరెబుల్ రంగాల షేర్లు రాణించాయి.

Contents
  • Stock Market Gains | ఒడిదుడుకుల మధ్య సాగి..
    • Stock Market Gains | ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు మినహా..
      • Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Gains | ఒడిదుడుకుల మధ్య సాగి..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) ఉదయం సెషన్‌లో ఒడిదుడుకుల మధ్య సాగింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 158 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లలో రికవరీ వచ్చింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,728 నుంచి 74,207 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 22,542 నుంచి 22,998 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి చివరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో 74,106 వద్ద, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,968 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు మినహా..

ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మీడియా సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.30 శాతం, రియాలిటీ 2.23 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.12 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.06 శాతం లాభపడగా.. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.37 శాతం, ఎనర్జీ 1.03 శాతం, మీడియా 0.22 శాతం నష్టపోయాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,207 కంపెనీలు లాభపడగా 1,147 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 78 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 89 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 7.89 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.94 శాతం, టైటాన్ 3.58 శాతం, ఎల్‌టీ 3.19 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.06 శాతం లాభపడ్డాయి.

Losers : రిలయన్స్ 3.41 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.20 శాతం, సన్‌ఫర్మా 0.08 శాతం నష్టపోయాయి

ఇది కూడా చదవండి..: April 06 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద
March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
TAGGED:Domestic Stock MarketDonald TrumpStock Market GainsStock MarketsStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hailstorm Crop Loss | Hailstorm Crop Loss | వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: దినేష్​ కులాచారి
Next Article Paddy Purchase Centers | Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?