అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gurukulam Inter Admissions | తెలంగాణ (Telangana) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026-27కు గాను ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ రెగ్యులర్ జూనియర్ కాలేజీలు (Residential Regular Junior Colleges), సీవోఐలు, వృత్తివిద్య, సైనిక కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలుర) ఎల్లారెడ్డి ప్రిన్సిపాల్ జి.నాగేశ్వరరావు తెలిపారు.
Gurukulam Inter Admissions | ఏప్రిల్ 25వ తేదీ వరకు..
ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రవేశాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGSWR RJCCET-2026) ద్వారా నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 13 (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Gurukulam Inter Admissions | అధికారిక వెబ్‌సైట్ ద్వారా..
దరఖాస్తులు సమర్పించాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://tgswreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ICSE/CBSE లేదా 2026 మార్చిలో నిర్వహించిన SSC పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు సంబంధిత గురుకుల విద్యాసంస్థలను లేదా అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసువాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
