అక్షరటుడే,హైదరాబాద్: bad luck signs | మనిషి జీవితంలో కష్టసుఖాలు రావడం సహజం. అయితే, ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి దురదృష్టం పట్టుకునే ముందు ప్రకృతి మనకు కొన్ని ముందస్తు హెచ్చరికలు పంపిస్తుందని చాణక్య నీతి చెబుతోంది.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాబోయే ఆపదలను పసిగట్టే ఐదు కీలక సంకేతాల గురించి వివరించారు. వీటిని గమనించి అప్రమత్తమైన వారు గండం గట్టెక్కుతారని, నిర్లక్ష్యం చేసిన వారు పతనం అవుతారని ఆయన హెచ్చరించారు.
bad luck signs | దురదృష్టానికి సూచికలు..
మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోవడం: ఇంట్లో పెంచుకునే పచ్చని మొక్కలు, ముఖ్యంగా తులసి కోట అకస్మాత్తుగా వాడిపోవడం ఆర్థిక సంక్షోభానికి తొలి సంకేతం. హిందూ ధర్మం ప్రకారం పచ్చదనం లక్ష్మీదేవికి చిహ్నం.
మొక్కలు ఎండిపోతున్నాయంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి (Negative Energy) పెరుగుతోందని అర్థం. ఇది కుటుంబంలో గొడవలకు లేదా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇలా జరిగినప్పుడు భయపడకుండా, వెంటనే ఆ మొక్కలను తొలగించి కొత్తవి నాటి, ఇంట్లో సాత్విక వాతావరణం నెలకొనేలా చూసుకోవాలి.
కారణం లేని కలహాలు: ఇంట్లో ప్రశాంతత మాయమై, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయంటే అది చెడు కాలానికి బలమైన సూచన. ఎక్కడైతే నిత్యం అరుపులు, కేకలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు.
“వినాశకాలే విపరీత బుద్ధి” అన్నట్లుగా మనిషి ఆలోచనలు వంకరగా మారి, తన పతనాన్ని తానే కోరుకుంటాడు. ఇంట్లో శాంతి లేని వ్యక్తి బయట సమాజంలో కూడా గౌరవాన్ని, విజయాన్ని పొందలేడు.
bad luck signs | పెద్దల పట్ల గౌరవం తగ్గడం:
తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష దైవాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఎదుగుదలకు కారణమైన పెద్దలను కించపరచడం మొదలుపెడతాడో, అప్పుడే అతని అదృష్టం నశిస్తుంది. చెడు కాలం వచ్చే ముందు హితవు చెప్పే పెద్దలు శత్రువుల్లా కనిపిస్తారు. వారి సలహాలను నిర్లక్ష్యం చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆస్తిని, అంతస్తును పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
గాజు వస్తువులు పగలడం: ఇంట్లో అద్దాలు లేదా గాజు సామాన్లు అకస్మాత్తుగా పగిలిపోవడం భారీ ఆర్థిక నష్టానికి సంకేతం. ముఖ్యంగా వ్యాపారస్తులు ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు పగులుతున్నాయంటే ఇంట్లో ఉన్నవారు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని లేదా ఏకాగ్రత కోల్పోయారని అర్థం. ఈ అజాగ్రత్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది.
ఆధ్యాత్మికతకు దూరం కావడం: అన్నిటికంటే ప్రమాదకరమైన సంకేతం ఇది. నిత్యం దైవచింతనలో ఉండే వ్యక్తి అకస్మాత్తుగా పూజలు మానేయడం లేదా దేవుడిని దూషించడం మొదలుపెడితే అతని కాలం బాగోలేదని గుర్తించాలి. ఆధ్యాత్మికతను వదిలేసిన వ్యక్తిలో అహంకారం పెరుగుతుంది. అహంకారం బుద్ధిని నాశనం చేస్తుంది, తద్వారా అతనికి సర్వనాశనం తప్పదని చాణక్యుడు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
