అక్షరటుడే, వెబ్‌డెస్క్: eye color personality | మనిషి మనస్తత్వాన్ని అద్దం పట్టేవి కళ్లు మాత్రమే. ఎదుటి వ్యక్తి స్వభావం ఎలాంటిదో వారి కళ్ల రంగును బట్టి సులభంగా అంచనా వేయవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. మన దేశంలో పురాతన కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ శాస్త్రం ప్రకారం కళ్ల రంగు మనిషి భవిష్యత్తును , ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది.
eye color personality | ఎరుపు రంగు కళ్లు:
కళ్లు సహజంగానే ఎరుపు ఛాయ కలిగి ఉంటే వారు అత్యంత ధైర్యవంతులని అర్థం. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ముందుంటారు. అయితే వీరికి కోపం కూడా త్వరగానే వస్తుంది. నాయకత్వ లక్షణాలు వీరిలో మెండుగా ఉంటాయి.
eye color personality | పసుపు రంగు కళ్లు:
సాముద్రిక శాస్త్రం ప్రకారం కళ్లలో పసుపు రంగు కనిపిస్తే వారు కొంత స్వార్థ చింతన కలిగి ఉంటారని అర్థం. తమ ప్రయోజనం కోసం వీరు ఎంతటి కష్టానికైనా వెనకాడరు. ఇలాంటి వారితో ఇతర వ్యక్తులు సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
నీలం రంగు కళ్లు:
నీలి రంగు కళ్లు ఉన్నవారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు సాత్విక స్వభావులు , అమితమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఎదుటివారికి సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది.
తెల్లని స్వచ్ఛమైన కళ్లు:
ఎవరి కళ్లయితే తెల్లగా ప్రకాశవంతంగా ఉంటాయో వారు అదృష్టవంతులు. వీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ అందరి పట్ల దయతో ఉంటారు. వృత్తిపరంగా వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి:
శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల ప్రకారం కళ్ల రంగుకు, మనిషి ప్రవర్తనకు దగ్గరి సంబంధం ఉంది. కళ్ల రంగును నిర్ణయించే జన్యువులే మెదడులోని ఫ్రంటల్ లోబ్ అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఈ పరిశోధన ప్రకారం ముదురు రంగు కళ్లు ఉన్నవారు త్వరగా నిర్ణయాలు తీసుకోగలరని, లేత రంగు కళ్లు ఉన్నవారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారని తేలింది.
ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!
