అక్షరటుడే, గాంధారి: Dog Bite | ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి (dog attack incident) చేసింది. గాంధారి (gandhari news) మండలంలోని నేరల్ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Dog Bite | తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరల్తండాలో (Neral Thanda) జెమిని బాయ్, బాల్ సింగ్కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే బాల్సింగ్ బయటకు వెళ్లగా.. బన్సీబాయ్ ఇంట్లో పనిచేసుకుంటుంది. ఈ క్రమంలో బాలుడు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఓ కుక్క బాలుడిని తీవ్రంగా గాయపర్చింది. స్పందించిన తల్లిదండ్రులు వెంటనే గాంధారి ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి కామారెడ్డి(Kamareddy) జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించినట్లు తెలిసింది.
