అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అసెంబ్లీ ఆవరణలో కారుతో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు సరబ్‌జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, కారును రూప్ నగర్ దగ్గర స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని కారుతో అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ముందు అతడు అసెంబ్లీ గేటు నంబర్ 2ను ఢీకొని లోనికి వెళ్లాడు. ఓ పుష్పగుచ్చాన్ని స్పీకర్ కార్యాలయం వద్ద ఉంచాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. దీంతో పుష్పగుచ్ఛంలో బాంబు ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం అందులో బాంబు లేదని తేల్చారు.
Delhi Assembly Security Breach | ప్రత్యేక బృందాలతో గాలింపు
భద్రతా ఉల్లంఘన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ (Delhi Police Commissioner) సతీష్ గోల్చా అసెంబ్లీకి చేరుకున్నారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) అనిల్ శుక్లా, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) రవీంద్ర యాదవ్, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు అప్పటికే ఘటనా స్థలంలో ఉన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పీలిభిత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.
దీనిని కూడా చదవండి : Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్‌కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు
