Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: sun damage skin | ఎండ వల్ల చర్మం నల్లగా మారుతోందా.. ఇలా చేస్తే రక్షణ గ్యారంటీ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - sun damage skin | ఎండ వల్ల చర్మం నల్లగా మారుతోందా.. ఇలా చేస్తే రక్షణ గ్యారంటీ!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

sun damage skin | ఎండ వల్ల చర్మం నల్లగా మారుతోందా.. ఇలా చేస్తే రక్షణ గ్యారంటీ!

ఎండ తగిలిన ప్రదేశంలో బంగాళాదుంపను మెత్తగా చేసి రాస్తే చర్మం చల్లగామారటమే కాకుండా మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై ఏర్పడిన నలుపును తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 6, 2026 6:59 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
sun damage skin
sun damage skin

అక్షరటుడే, వెబ్​డెస్క్​: sun damage skin | వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి చర్మం కందిపోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతుంటారు.

Contents
  • sun damage skin | చర్మ సంరక్షణలో పండ్ల పాత్ర:
    • sun damage skin | గ్రీన్ టీతో రక్షణ:
      • బంగాళాదుంపతో మెరుపు:

అయితే, కేవలం పైన రాసే లోషన్లు మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల (UV Rays) ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ప్రత్యేక పోషకాలు మన దైనందిన ఆహారంలో ఉండటం వల్ల ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

sun damage skin | చర్మ సంరక్షణలో పండ్ల పాత్ర:

వేసవిలో చర్మం కందిపోకుండా ఉండటంలో కొన్ని రకాల పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దానిమ్మలో ఉండే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యరశ్మి ప్రభావం నేరుగా చర్మంపై పడకుండా అడ్డుకుంటుంది.

ఇది చర్మంలో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో లభించే విటమిన్ సీ చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ క్యాన్సర్ వంటి ముప్పుల నుంచి కాపాడటమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. వీటితో పాటు పుచ్చకాయ, కివీ వంటి పండ్లు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

sun damage skin | గ్రీన్ టీతో రక్షణ:

ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే ఇది చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ఎండ వల్ల చర్మం కందిపోకుండా కాపాడటంలో సహాయపడతాయి. ఎండలో బయటకు వెళ్లేవారు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి దృఢంగా మారుతుంది.

బంగాళాదుంపతో మెరుపు:

చాలా మందికి ఇష్టమైన బంగాళాదుంప కూడా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. ఎండ తగిలిన ప్రదేశంలో బంగాళాదుంపను మెత్తగా చేసి రాస్తే చర్మం చల్లగామారటమే కాకుండా మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై ఏర్పడిన నలుపును తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!

Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీలో ప్రయాణాలా.. భయం వద్దు.. ఈ ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే చాలు!
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
TAGGED:beauty tipsglowing skin tipshealthy skin dietnatural skincareskin care tipssummer skin protectionsun damage skinUV protection foods
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 07 Gold Rates April 07 Gold Rates | బంగారం ధర పెరుగుదలకు బ్రేక్.. నేటి రేట్స్​ ఎంతంటే!
Next Article Amy Jones Pippa Cleary Marriage Amy Jones Pippa Cleary Marriage  | ఎల్ల‌లు దాటిన ప్రేమ‌.. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?