అక్షరటుడే, కామారెడ్డి: Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ మేరకు నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Nizamabad SC ST Court) నాయమూర్తి శ్రీనివాస్ సోమవారం తీర్పునిచ్చారు.
Caste Abuse Case | ఫోన్ కలవకపోవడంతో..
రామారెడ్డి (Ramareddy) మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కొత్తోల్ల అనిల్ అనే యువకుడు 2021 జనవరి 26 న గ్రామ శివారులోని హాస్టల్ వద్ద కల్వర్టుపై స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి ఎండీ రఫీ అనే వ్యక్తి బైక్‌పై అనిల్ వద్ద ఆగి సర్పంచ్ ఫోన్ నంబర్ అడిగాడు. అయితే ఫోన్ నంబర్ తప్పుగా డయల్ చేయడంతో నంబర్ కలవలేదు. దాంతో కోపంతో ఊగిపోయిన రఫీ అనిల్‌ను కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగాడు. మరుసటి రోజు రామారెడ్డి పోలీసులకు అనిల్ ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిజామాబాద్(nizamabad) కోర్టులో సమర్పించారు. పరిశీలించిన న్యాయమూర్తి రఫీకి ఏడాది జైలుశిక్ష, రూ.2,700 జరిమానా విధిస్తు తీర్పునిచ్చారు.
ఇది కూడా చదవండి: Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్
