Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల

నిజామాబాద్

Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల

భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు తెలిపారు. ఈ మేరకు ఆలయానికి రూ.1.80 కోట్లు మంజూరు చేయించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 7:36 సా.
Shashi kiran Mottala
4 రోజులు ago
Share
Temple Development Funds |
Temple Development Funds | మాటిచ్చి..నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీ నిధుల విడుదల..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Temple Development Funds | తాడ్వాయి మండలం సంతాయిపేటలోని భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి (bheemeshwara temple) ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు (mla madan mohan rao) గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలయానికి రూ.1.80 కోట్లు మంజూరు చేయించారు.

Contents
  • Temple Development Funds | శివరాత్రి రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి..
    • Temple Development Funds | నిధుల విడుదలలో కీలకపాత్ర..

Temple Development Funds | శివరాత్రి రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి..

ఇటీవల శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సోమవారం ఆలయానికి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (yellareddy news) తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంతీయంగా విశేష ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి నుండి అనేక మంది శివభక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.

Temple Development Funds | నిధుల విడుదలలో కీలకపాత్ర..

ఈ నిధుల సాధనలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. ఆలయ ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావిస్తూ, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా, వ్యక్తిగతంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, టీజీటీడీసీ ఎండీ క్రాంతిని కలిసి ఆలయ అభివృద్ధి అవసరాన్ని వివరించి నిధుల మంజూరుకు కృషి చేశారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయ అభివృద్ధి అంశాన్ని గత పాలకులు పట్టించుకోకపోయినా, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు విడుదల చేయించారు.

ఇది కూడా చదవండి: Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్

Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ
Complaint Against SI | బాల్కొండ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు
Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
TAGGED:bheemeshwara templegovernment fundsMLA Madan Mohan Raoreligious tourismTelangana Politicstemple development fundsYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Caste Abuse Case | Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు
Next Article Sathankulam Custodial Death Case Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?