అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్ (Adilabad) ఎయిర్‌పోర్టు నిర్మాణానికి త్వరలో శిలాఫలకం వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించామని చెప్పారు. వీలైతే జూన్ 2 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్‌లో సీఎం సోమవారం “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ” బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు (Pranahita-Chevella Project)ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనది పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో త్వరలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి కూడా భూసేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Adilabad Airport | ఎన్నికలప్పుడే రాజకీయాలు
ఎన్నికలప్పుడే రాజకీయాలు అని సీఎం అన్నారు. తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు.
ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశామని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని వెల్లడించారు.
Adilabad Airport | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీఎం తన పర్యటనలో భాగంగా బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామం, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోథ్ మండలం పొచ్చెరలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్లో వంతెనను ప్రారంభించారు.
దీనిని కూడా చదవండి : Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
