అక్షరటుడే, న్యూఢిల్లీ: Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం చట్టం జూన్ 2, 2024 నుంచే అమల్లో ఉన్నట్లైంది.
Amaravati Capital Gazette | చట్టబద్ధ గుర్తింపు..
పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ద్వారా అమరావతికి చట్టబద్ధత లభించింది. దీంతో ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లైంది.
తాజా సవరణ ద్వారా 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేసి, అమరావతిని అధికారిక రాజధానిగా గెజిట్‌లో చేర్చారు. అంతేకాకుండా, ఈ చట్టం జూన్ 2, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 2014లో హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు తాత్కాలిక సంయుక్త రాజధానిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. సదరు గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడంపై వెలువడిన నిర్ణయం కీలక మలుపుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే తులం బంగారం!
