అక్షరటుడే, మెండోరా: Pochampad | నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పాత వివాదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు.
Pochampad | పాత గొడవల నేపథ్యంలో..
పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపాడ్‌కు చెందిన రిషిక్, నర్సింలు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి నర్సింలు ఇంటి వద్దకు రిషిక్ వెళ్లగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రిషిక్‌పై నర్సింలు కత్తితో దాడి చేశాడు. అతనికి కడుపులో తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడిని నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Sathankulam Custodial Death Case | లాకప్‌డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
