Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా

జాతీయం

Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా

ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేశారు. సంస్థ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 10:57 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Air India CEO Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India CEO Resignation | టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (CEO Campbell Wilson) రాజీనామా చేశారు. 2022లో ఐదేళ్ల కాంట్రాక్ట్‌పై ఆయన నియమితులయ్యారు. విల్సన్​ పదవీకాలం జూలై 2027లో ముగియనుంది. అంతలోపే ఆయన రాజీనామా చేశారు.

Contents
  • Air India CEO Resignation | భారీగా నష్టాలు
    • Air India CEO Resignation | విల్సన్ నేపథ్యం

ఎయిరిండియా (Air India) ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. గతేడాది అహ్మదాబాద్​లో ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిన ఘటనలో 260 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం, నిరంతర నష్టాలు, పెరిగిన నియంత్రణ సంస్థల పరిశీలనతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారని సమాచారం.

Air India CEO Resignation | భారీగా నష్టాలు

టాటా సన్స్ గ్రూప్‌ (Tata Sons Group)లోని ఎయిరిండియా ఆర్థిక సంవత్సరం 2026లో సుమారు రూ. 29 వేల కోట్ల నష్టాన్ని నమోదు చేస్తుందని అంచనా.
2025 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 11,000 కోట్లుగా ఉంది. పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం, 100 డాలర్లకు పైగా పెరిగిన ముడి చమురు ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) వంటి అనేక బాహ్య ఒత్తిళ్లతో సంస్థ నష్టాలు పెరిగాయి. 191 బోయింగ్, ఎయిర్‌బస్ విమానాల సముదాయాన్ని కలిగిన ఈ భారతీయ విమానయాన సంస్థను టాటా గ్రూప్​ 2022లో కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియాకు ఎన్. చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా ఉన్నారు, ఆయన టాటా గ్రూప్‌కు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. టాటాతో పాటు, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో 25 శాతం వాటా ఉంది. అయితే సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో సీఈవో రాజీనామా చేయడం గమనార్హం.

Air India CEO Resignation | విల్సన్ నేపథ్యం

క్యాంప్‌బెల్ విల్సన్​కు విమానయాన రంగం (Aviation Sector)లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022లో ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమితులయ్యారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) పూర్తి యాజమాన్యంలోని లో-కాస్ట్ అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా కూడా సేవలందించారు. కాగా ఇటీవల ఇండిగో సీఈవో పీటర్​ ఎల్బర్స్​ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు

LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
TAGGED:Ahmedabad Plane CrashAir Indiaaviation sectorCEO Campbell WilsonTata Sons Group
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sainyasena Organization Sainyasena Organization | అధైర్య పడొద్దు.. కొడుకులా అండగా ఉంటా: ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు
Next Article TTD Demonetized Notes TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?