Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటీ.. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నల్గొండ - Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటీ.. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు

నల్గొండ

Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటీ.. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 11:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Government School Admissions

అక్షరటుడే, వెబ్​డెస్క్: Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నల్గొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో చోటు చేసుకుంది.

Contents
  • Government School Admissions | భారీగా బారులు
    • Government School Admissions | కార్పొరేట్​ స్థాయి విద్య

రాష్ట్రంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన అడ్మిషన్లు ఉండటం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడికి పంపడానికి మొగ్గు చూపుతున్నారు. సర్కార్​ బడుల్లో వసతులు ఉన్నా.. ప్రైవేట్​కే పంపుతున్నారు. 90 శాతం మంది ప్రభుత్వ టీచర్లు (Government Teachers) సైతం తమ పిల్లలను ప్రైవేట్​ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రం వంద శాతం అడ్మిషన్లు అవుతున్నాయి.

Government School Admissions | భారీగా బారులు

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్ల తాకిడి నెలకొంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్మిషన్ల కోసం డిమాండ్ భారీగా పెరగడంతో తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే బడి ఎదుట బారులు తీరుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తన కుమారుడు ప్రతీక్​ జ్ఞాపకార్థం ఈ బడిని అభివృద్ధి చేశారు. తన ట్రస్ట్ ద్వారా రూ. 8 కోట్లు వెచ్చించి ఈ పాఠశాలను ఆధునీకరించారు. ఇందులో 36 ఏసీ స్మార్ట్ తరగతి గదులు, AI-ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్‌ (Digital Lab)లను ఏర్పాటు చేశారు.

Government School Admissions | కార్పొరేట్​ స్థాయి విద్య

ఆంగ్ల, ఉర్దూ మీడియంలలో బోధనతో పాటు క్రీడా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. బడిలో ఆధునిక వసతులు ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి పోటీ పడుతున్నారు. ఈ బడి పేద, మధ్యతరగతి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుండటంతో తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం బారులు తీరుతున్నారు. మిగతా పాఠశాలల్లో సైతం ఇలాంటి వసతులు కల్పిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి మొగ్గు చూపుతారు.

#Nalgonda Govt School sees massive demand #Parents are lining up from early morning for admissions at #KomatireddyPrateek Government School in Nalgonda, Telangana, as demand surges.

The school was rebuilt with ₹8 crore by Minister & Congress MLA @KomatireddyKVR through his… pic.twitter.com/o7SP6YyIlK

— NewsMeter (@NewsMeter_In) April 7, 2026

ఇది కూడా చదవండి..: Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి

 

 

 

Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ
 Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు
Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
TAGGED:Digital LabGovernment School AdmissionsGovernment TeachersMinister Komatireddy Venkat ReddyNalgonda District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Iran War Warning Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Next Article KTR Anger KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?