అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Crop Compensation Demand | ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్‌ను (Collectorate) ముట్టడించారు.
Crop Compensation Demand | రైతులను ఆదుకొని అధికారులు ఎందుకు..
రైతులకు మద్దతు తెలుపుతూ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ జిల్లాలో వడగండ్ల వర్షం కారణంగా వందల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, జొన్న పంటలు నష్టపోయాయన్నారు. కానీ ఇప్పటివరకు అధికారులు ఈ పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత ఉన్న అధికారులు గ్రామాలను సందర్శించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గంలోని (Bodhan Constituency) సాలూర, ఖాజాపూర్, నాగేశ్వర్, రూరల్ నియోజకవర్గం నుంచి డిచ్పల్లి, సుద్దపల్లికి చెందిన సుమారు 100 మంది రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ఎదుట భైఠాయించారు.

ఇది కూడా చదవండి..: Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్
