Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..

జాతీయం

Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..

ఆ గ్రామంలో ఒక కోడి గుడ్డు రూ. 6 వేలు పలికింది. మరోచోట ఆపిల్ రూ. 1.05 లక్షలకు అమ్ముడుపోయింది. ఇరాన్‌లో సహాయక చర్యల నిమిత్తం లడఖ్ ప్రాంతవాసులు ఇలా వేలం పాటలు నిర్వహిస్తూ విరాళాలు సేకరించి పంపిస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 12:50 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Ladakh Donation Auctions

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ladakh Donation Auctions | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలం అవుతోంది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హతమైన తర్వాత పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా లడఖ్‌లో భారీ ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Contents
  • Ladakh Donation Auctions | కక్సర్‌లో గుడ్డు వేలం..
    • Ladakh Donation Auctions | మరో గ్రామంలో ఆపిల్ వేలం..

ప్రధానంగా ఇరాన్ పునర్నిర్మాణం పేరుతో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతంలో విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. లడఖ్‌ (Ladakh)లోని కార్గిల్ ప్రాంతంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వీరు గత నెలరోజులుగా విరాళాలు సేకరిస్తున్నారు. చిన్నచిన్న కానుకలను వేలం వేస్తూ భారీగా విరాళాలను సమీకరిస్తున్నారు. సేకరించిన విరాళాలను ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి (Iran Embassy) పంపిస్తున్నారు.

Ladakh Donation Auctions | కక్సర్‌లో గుడ్డు వేలం..

కార్గిల్ జిల్లా (Kargil District)లోని కక్సర్ గ్రామంలో గత వారం ఒక మహిళ మూడు కోళ్లను స్థానిక మసీదుకు విరాళంగా అందించింది. ఆ కోళ్లలో ఒకటి గుడ్డు పెట్టింది. మరిన్ని విరాళాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ గుడ్డును వేలం వేశారు. రూ. 100 బిడ్‌తో వేలం ప్రారంభం కాగా.. జనం పోగవడంతో ధర పెరుగుతూ వచ్చింది. చివరికి ఓ వ్యక్తి ఆ గుడ్డును రూ. 6 వేలకు కొనుగోలు చేశారు.

Ladakh Donation Auctions | మరో గ్రామంలో ఆపిల్ వేలం..

కర్కిట్చూ అనే గ్రామం (Karkitchu village)లో ఇటీవల ఇలాగే ఇరాన్ పునరావాసం కోసం కానుకగా వచ్చిన ఒక ఆపిల్‌ను వేలం వేశారు. రూ. 200 లతో వేలం ప్రారంభమైంది. చివరికి ఓ వ్యాపారి దీనిని రూ. 1.05 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇలా సేకరించిన విరాళాలను న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి పంపిస్తున్నారు. ఇరాన్ పునర్నిర్మాణానికి సహకరించినందుకు జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో సందేశాలను పోస్ట్ చేస్తోంది.

ఇది కూడా చదవండి..: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు

Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
TAGGED:Ayatollah Ali KhameneiIran EmbassyKargil DistrictKarkitchu villageLadakhLadakh Donation Auctions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Crop Compensation Demand Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..
Next Article Hormuz Tanker Green Asha Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?