అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hormuz Tanker Green Asha | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీజ్ ఫైర్‌పై ఆశలు రేకెత్తుతున్నా.. ఇరు దేశాలు మొండిగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ తన అధీనంలోకి తీసుకోవడంతో సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మిత్ర దేశాల నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇస్తున్నా.. అత్యంత జాగ్రత్తగా జలసంధిని దాటాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది.
Hormuz Tanker Green Asha | భారత్‌కు ఊరట..
పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. అప్పటినుంచి హార్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయినా భారత్ (India) దౌత్యంతో ఒక్కో నౌక క్షేమంగా తీరాలకు చేరుతోంది. ఇప్పటికే ఎనిమిది నౌకలు ఈ జలసంధిని దాటి తీరాలకు చేరాయి. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న తొమ్మిదో నౌక ‘గ్రీన్ ఆశ’ సైతం సోమవారం హార్మూజ్ జలసంధిని దాటింది. కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. సుమారు 46,650 టన్నుల ఎల్‌పీజీ లోడ్‌తో వస్తున్న గ్రీన్ సాన్వి నౌక ఏప్రిల్ 7న తీరం చేరగా.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న గ్రీన్ ఆశా ఏప్రిల్ 9 నాటికి తీరం చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 16 భారతీయ నౌకలు (Indian Ships) ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని సైతం భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు తీసుకుంటోంది.
ఇది కూడా చదవండి..: Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
