Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్​

Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 1:50 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Perni Nani Politics

అక్షరటుడే, వెబ్​డెస్క్: Perni Nani Politics | సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి అంచ‌నాలు ఈ మ‌ధ్య త‌ప్పుతున్నాయి. కొంతమంది హీరోల విషయంలో చెప్పిన విషయాలు రివర్స్ కావ‌డంతో చాలాసార్లు ట్రోలింగ్​కు గురయ్యారు.

Contents
  • Perni Nani Politics | జాతకంపై విశ్లేషణ
    • Perni Nani Politics | రాజకీయ వర్గాల్లో చర్చ

ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) గురించి ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ కావ‌డంతో మ‌నోడిని ఫుల్ ట్రోల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ తాను ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా వేణు స్వామి వ‌ల‌న‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అయిన పేర్ని నాని (Perni Nani)పేరు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venu Swamy) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Perni Nani Politics | జాతకంపై విశ్లేషణ

వేణు స్వామి మాట్లాడుతూ.. పేర్ని నాని జాతకంలో బలమైన గ్రహస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఆయనకు మరింత మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. “రాజకీయాల్లో  ఆయనకు ఇంకా తిరుగులేదు” అంటూ స్పష్టంగా తెలియ‌జేశారు. పేర్ని నాని రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదని, త్వరలోనే ఆయన మరోసారి కీలక పాత్రలో కనిపించే అవకాశముందని వేణు స్వామి అభిప్రాయపడ్డారు. ప్రజల మద్దతు ఆయనకు బలంగా ఉండబోతోందని కూడా అన్నారు.

Perni Nani Politics | రాజకీయ వర్గాల్లో చర్చ

ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పేర్ని నాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వేణు స్వామి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటే, మరికొందరు ఇది కేవలం జ్యోతిష్య అంచనా మాత్రమేనని భావిస్తున్నారు. వేణు స్వామి గతంలో కూడా పలువురు రాజకీయ నాయకుల భవిష్యత్తుపై చేసిన అంచనాలతో వార్తల్లో నిలిచారు. కొన్నిసార్లు ఆయన చెప్పినవి నిజం కావడంతో, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే ఈ అంశం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. మొత్తానికి, జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి..: TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి

Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
TAGGED:Andhra PradeshAstrologer Venu SwamyPerni NaniPerni Nani PoliticsRebel Star Prabhas
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hormuz Tanker Green Asha Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
Next Article Mojtaba Khamenei Coma Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?