అక్షరటుడే, వెబ్‌డెస్క్: Suicide Drones | భారత అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు చేరాయి. వందలాది సూసైడ్ డ్రోన్లను సూరత్ (Surat)కు చెందిన స్టార్టప్ కంపెనీ ఆర్మీకి అప్పగించింది. ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీ సంస్థతో రక్షణశాఖ గత డిసెంబర్‌లో రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికేజ్ డ్రోన్లను ఆర్మీకి అప్పగించింది.
ప్రస్తుతం యుద్ధతంత్రం మారింది. క్షిపణులు, డ్రోన్లు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వ్యయంతో నిర్మించిన సూసైడ్ డ్రోన్లు శత్రువులకు భారీగా నష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ వాటిని సమకూర్చుకోవాలని భావించింది. ఇందులో భాగంగా గుజరాత్ (Gujarat)కు చెందిన ఒక డీప్-టెక్ డ్రోన్ కంపెనీతో గతంలో ఒప్పందం చేసుకుంది. సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీతో గత ఏడాది డిసెంబర్‌లో ఈ కాంట్రాక్టు కుదిరింది. అత్యవసర సేకరణ మార్గం ద్వారా రెండు నెలల్లోనే డ్రోన్లను సైన్యానికి అందజేశారు.
Suicide Drones | 120 కి.మీ. వేగంతో..
ఈ డ్రోన్లు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. రియల్-టైమ్ టార్గెటింగ్‌తో టార్గెట్‌ను ధ్వంసం చేస్తాయి. కచ్చితమైన దాడుల కోసం AI-ఆధారిత మార్గనిర్దేశం వ్యవస్థ వీటిలో ఉంది. గరిష్టంగా 2.5 కిలో మీటర్ల ఎత్తులో ఎగరగలవు. 2.5 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలవు. కచ్చితత్వంతో పేలోడ్‌ను చేరవేసే సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్లలో (Surgical Strike Operations) ఇవి కీలకంగా మారనున్నాయి.
Suicide Drones | జీపీఎస్ లేకున్నా..
ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV), కమికాజీ డ్రోన్‌లలో GPS అందుబాటులో లేని జోన్‌లు, కఠినమైన వాతావరణాలలో పనిచేయడానికి రూపొందించిన సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. FPV డ్రోన్‌లను ప్రత్యేకమైన గాగుల్స్ ఉపయోగించి ఆపరేట్ చేస్తారు. ఇవి మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా పని చేయగలవు. ఈ ఒప్పందం దేశీయ రక్షణ తయారీ రంగం వైపు జరుగుతున్న విస్తృత ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. కచ్చితమైన మానవరహిత వ్యవస్థలను వేగంగా, పెద్ద ఎత్తున అందించగల సామర్థ్యం ఉన్న స్వదేశీ సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
ఇది కూడా చదవండి..: Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
