అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని (grain purchase centers) ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, మార్కెట్ కమిటీ (Yellareddy Market Committee) ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి సూచించారు. ఎల్లారెడ్డి (Yelalreddy) మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Paddy Procurement Centers | కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ మేరకు..
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు (MSP rates) ధర ప్రకారం గ్రేడ్-1వరికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకం వరికి క్వింటాలు రూ.2,369కు కొనుగోలు చేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రొక్యూర్మెంట్ యాప్ వినియోగించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో (paddy procurement) తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, తహశీల్దార్ ప్రేమ్ కుమార్, కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్ డ్రోన్లు
