అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trisha Marriage Rumors | దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా నిలిచిన త్రిష కృష్ఱన్ (Trisha Krishnan ) గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ విజయాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్, సినిమాలకు గుడ్‌బై చెప్పి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం నెట్టింట హల్‌చల్ సృష్టించింది.
ప్రత్యేకంగా ఒక సంపన్న వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సినీ రంగానికి దూరమవుతుందనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందాయి. అంతేకాకుండా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లో కూడా త్రిష పేరు వినిపించడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది.
Trisha Marriage Rumors | రూమర్స్‌పై త్రిష ఘాటు స్పందన
ఈ వార్తలపై త్రిష కృష్ణన్ స్పందిస్తూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. కేవలం ఆకర్షణ కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (Instagram Story)లో ఘాటుగా స్పందిస్తూ ..నేను సినిమాలు మానేశానట, ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నానట, నిన్న రెండేళ్లు నిండిన నాలుగు కవల పిల్లలను పెంచుతున్నానట! ఇంకేం చెప్పాలి? ఈరోజు కల్పిత కథల కోటా పూర్తయ్యిందా?” అంటూ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. త్రిష తన కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా వెల్లడించారు.
Trisha Marriage Rumors | “ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు”
ఇటీవల ఆమె షేర్ చేసిన “ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు” అనే పోస్ట్ కూడా పెద్ద చర్చకు దారితీసింది. త్రిష చేసే ప్రతి సోషల్ మీడియా పోస్టు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక విజయ్ , ఆయన భార్య సంగీత మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో త్రిష పేరు వినిపించడం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈ విషయాలపై త్రిష ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. మొత్తానికి, రిటైర్మెంట్ , పెళ్లి రూమర్స్‌పై త్రిష ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊరట చెందారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టి పెట్టి తన కెరీర్‌ను కొనసాగించనున్నట్లు స్పష్టమైంది.
ఇది కూడా చదవండి..: Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
