అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Health Camp | నిత్యం పనిఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని సీపీ సాయిచైతన్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Manorama Super Specialty Hospital) ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Police Health Camp | వైద్యుల సూచనలు పాటించాలి
ఈ సందర్భంగా సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. పనిఒత్తిడిలోనూ సిబ్బంది వైద్యుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న పండ్లను సైతం జాగ్రత్తగా చూసి కొనాలన్నారు. మన శరీరానికి ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని అంతేకానీ జీర్ణం కానీ ఆహారం తీసుకొని బాధపడకూడదన్నారు.

Police Health Camp | ఆర్నెళ్లకొకసారి చెకప్ తప్పనిసరి..
ప్రతి ఆర్నెళ్లకొకసారి ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హెల్త్ చెకప్ (Health Check-up) చేయించుకోవాలని సీపీ సూచించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సీపీ సాయిచైతన్య, మేయర్ ఉమారాణితో కలిసి క్యాంప్‌ను ప్రారంభించారు. క్యాంప్‌లో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు ఉచితంగా వైద్యం, అన్నిరకాల పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురంధాల, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ అశోక్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు విశాల్, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసింహ కట్ట తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
