అక్షరటుడే, వెబ్‌డెస్క్ః Rajnath Singh Warns Pakistan | పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Minister Rajnath Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ జోలికి వస్తే ఆ దేశం ఎన్నిక ముక్కలవుతుందో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకవేళ పాకిస్థాన్.. పశ్చిమ బెంగాల్ వైపు కన్నెత్తి చూసినా.. దేశ సమగ్రతకు భంగం కలిగించాలని ప్రయత్నం చేసినా.. ఆ దేశం మరిన్ని ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిన చారిత్రక ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Rajnath Singh Warns Pakistan | తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు చేశారు. బెంగాల్‌లో చొరబాట్లు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సరిహద్దులను పటిష్టం చేసిందని వివరించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అణిచివేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. అది ఎప్పటికీ భారతదేశం (India)లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలే త్వరలో భారత్‌లో చేరాలని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
Rajnath Singh Warns Pakistan |తీవ్ర చొరబాటుదారుల సమస్య
బెంగాల్‌లోని ముర్షిదాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో చొరబాటుదారుల సమస్య తీవ్రంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీంతో స్థానిక జనాభా సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) దేశ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయన్నారు.
ఇది కూడా చదవండి..: Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
