Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​

నిజామాబాద్

CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 6:31 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
CT Scan Facility

అక్షరటుడే, కామారెడ్డి: CT Scan Facility | సీటీ స్కాన్ యంత్రాన్ని టీ హబ్ భవనంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్యాధికారులకు సూచించారు. జీజీహెచ్​ డెవలప్ మెంట్ సొసైటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, ఇతర అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

Contents
  • CT Scan Facility | 99శాతం పూర్తయిన పనులు..
    •  CT Scan Facility | ప్రసూతి కేసుల పెరుగుదల
      • CT Scan Facility | కొత్త భవనంలోకి జీజీహెచ్​..?

CT Scan Facility | 99శాతం పూర్తయిన పనులు..

ఆస్పత్రిలో చేపట్టిన పనుల్లో సుమారు 99శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. హెచ్‌డీఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు రూ.18లక్షలు అందుబాటులో ఉండగా అందులో రూ.10 లక్షలు క్యాన్సర్ కేర్, పాలియేటివ్ సేవలకు కేటాయించగా, రూ.2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్‌గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ (Panchayat Raj Engineering Department) ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు.

 CT Scan Facility | ప్రసూతి కేసుల పెరుగుదల

కేసీఆర్ కిట్ (KCR Kit) అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల వివరాలను ఇవ్వాలని సూచించారు. హాస్పిటల్‌లో సీటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని, ప్రస్తుత టీ-హబ్ భవనంలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అందుబాటులో లేని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్‌కు సుమారు రూ.8వేలు వ్యయం అవుతుందని తెలపగా, దీనిపై ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

CT Scan Facility | కొత్త భవనంలోకి జీజీహెచ్​..?

జీజీహెచ్​ను కొత్త భవనానికి మార్చే విషయమై కలెక్టర్​, ఎమ్మెల్యే చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం (Medical College Building) జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని, కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసీహెచ్ భవనాన్ని ఆస్పత్రి కోసం వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం టీఎస్ఎంఐడీసీ, ఆర్అండ్​బీ ఇంజినీర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, జిల్లావైద్యాధికారి, ఆర్డీవో, ఆర్ఎంవోలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ఒక వెంటిలేటర్ అందజేస్తామని రెడ్​క్రాస్ సొసైటీ తరపున రాజన్న తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమెహన్ (Additional Collector Madhumohan), ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ వెంకటేశ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ వాల్యా, ఆర్డీవో ఎన్ వై గిరి, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్ రావు
TAGGED:Collector Ashish SangwanCT Scan FacilityGovernment Hospitalhealthcare developmenthospital upgradesKamareddy NewsKCR KitMedical College Buildingmedical infrastructurePanchayat Raj Engineering Departmentpublic health servicesTelangana health
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article David Warner Arrest David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అరెస్ట్‌..
Next Article Matham Pawan Case | Matham Pawan Case | కుట్రతో నాపై కేసు పెట్టారు..: కార్పొరేటర్​ మఠం పవన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?