Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​

అంతర్జాతీయం

Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. నేటి రాత్రితో ఆ దేశ​ నాగరికత అంతం అవుతుందన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 6:23 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Trump Final Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Final Warning | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ ఇరాన్​కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హర్ముజ్​ జలసంధిని మంగళవారం రాత్రి లోగా తెరవకపోతే ఇరాన్ (Iran)​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్​ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని పవర్​ ప్లాంట్లు, వంతెనలు సహా మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తామన్నారు. అయితే అమెరికా వార్నింగ్​ను ఇరాన్​ పట్టించుకోవడం లేదు. తమ దేశంలో 1.4 కోట్ల మంది ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఇరాన్​ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్​ మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. సోషల్ మీడియా ట్రూత్​లో పోస్ట్​ చేశారు.

Trump Final Warning | అద్భుతం జరగొచ్చు

ఇరాన్​ నేటి రాత్రి అంతం అవుతుందని ట్రంప్​ అన్నారు. అది జరగొద్దనే తాను అనుకుంటున్నాని, కానీ జరగొచ్చని చెప్పారు. ఆ నాగరికతను వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదన్నారు. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం కానుందని పేర్కొన్నారు. 47 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుందన్నారు. ఇరాన్‌ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. దీంతో ఏం జరుగుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

వాషింగ్టన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు) వరకు లొంగిపోవడానికి టెహ్రాన్‌కు సమయం ఉందని ట్రంప్ అన్నారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొత్త శిఖరానికి చేరడంతో ఇరాన్​ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

దీనిని కూడా చదవండి : Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?

Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
Minuteman III Missile | అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా.. ఇరాన్‌పై దాడుల వేళ ప్రయోగం..
Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
TAGGED:Hormuz Strait CrisisIran Trump newsMiddle East conflictTrump final warningUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Matham Pawan Case | Matham Pawan Case | కుట్రతో నాపై కేసు పెట్టారు..: కార్పొరేటర్​ మఠం పవన్​
Next Article Teachers Pay Delay | Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?